Amaravati: రాజధాని పోరులో ఆగిన మరో రైతు గుండె.. బాధిత కుటుంబ సభ్యులకు లోకేశ్ పరామర్శ

  • మంగళగిరి మండలం నవులూరులో ఘటన
  • రైతు రంగిశెట్టి వెంకటేశ్వరరావు గుండెపోటుతో మృతి
  • 41 రోజులుగా ఆందోళనలో పాల్గొన్న వెంకటేశ్వరరావు
అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు 42వ రోజుకు చేరుకున్నాయి. మరోపక్క, రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. మంగళగిరి మండలం నవులూరులో రంగిశెట్టి వెంకటేశ్వరరావు అనే రైతు ఈ రోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. రాజధానిపై మనస్తాపంతోనే వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు ఆయన బంధువులు తెలిపారు. 41 రోజులుగా మంగళగిరి మండలంలో ఆందోళనల్లో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను టీడీపీ నేత నారా లోకేశ్ పరామర్శించారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని చెప్పారు.
Amaravati
Andhra Pradesh
Nara Lokesh
Telugudesam

More Telugu News