Vijayasai Reddy: దత్తపుత్రుడు అలియాస్ బెత్తం నాయుడు: పవన్ కల్యాణ్‌ను ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డి

  • బెత్తం నాయుడి రియాక్షన్‌ను సోషల్ మీడియా ముందుగానే ఊహించింది 
  • చంద్రబాబుకు గాయమైతే ఈయన అమ్మా అని అరుస్తాడు
  • నిమిషాల వ్యవధిలోనే స్పందించడం ప్యాకేజి తీసుకున్నవాడి బాధ్యత  
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నుంచి పవన్ ప్యాకేజీ తీసుకుంటారని, చంద్రబాబుకు గాయమైతే పవన్ అరుస్తారని ఆయన పరోక్షంగా చురకలంటించారు.

'దత్తపుత్రుడు అలియాస్ బెత్తం నాయుడి రియాక్షన్ ను ఎప్పటిలాగే సోషల్ మీడియా ముందుగానే ఊహించింది. చంద్రబాబుకు గాయమైతే ఆయన కంటే ముందే ఈయన అమ్మా అని అరుస్తాడు. నిమిషాల వ్యవధిలోనే ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ప్యాకేజి తీసుకున్నవాడి బాధ్యత కదా!' అని విజయసాయిరెడ్డి పవన్ పై పరోక్షంగా వ్యంగ్యం కురిపిస్తూ ట్వీట్ చేశారు.

Vijayasai Reddy
YSRCP
Pawan Kalyan
Janasena

More Telugu News