Vizag Airport: విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కరోనా అలర్ట్!

  • కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు
  • ప్రయాణికులను పరిశీలిస్తున్న ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్
  • కరోనా లక్షణాలు లేకుంటేనే నగరంలోకి
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇండియాలో వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, విశాఖపట్నం విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యే ప్రయాణికులు, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే వారిని పరిశీలించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు.

కరోనా వైరస్ ఇప్పటికే సోకిన దేశాల నుంచి వచ్చే వారికి ఇక్కడ ప్రత్యేక పరీక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద ప్రయాణికుల అవగాహన కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. చైనా, దుబాయ్, మలేషియా, సింగపూర్ నుంచి నగరానికి వస్తున్న వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, వారిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేకుంటేనే నగరంలోకి పంపుతున్నామని అధికారులు పేర్కొన్నారు. 
Vizag Airport
Karona
Corona Virus
Travellers

More Telugu News