America: అమెరికాలోని బోటు డాక్‌యార్డ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. మంటల్లో 35 బోట్లు!

  • ఇప్పటివరకు 8 మంది మృతి
  • ఆత్మరక్షణార్థం నదిలో దూకిన మరికొందరు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
అమెరికాలోని టెన్నెస్సీ నదీ తీరం వెంబడి ఉన్న బోటు డాక్‌యార్డ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గల్లంతయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం నిన్న వేకువ జామున ఈ ప్రమాదం జరిగింది. మొత్తంగా 35 పడవలు మంటల్లో చిక్కుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, స్కాట్స్‌బోరో అగ్నిమాపక అధికారి జెనె నెక్లాస్ తెలిపారు.

ప్రమాద సమయంలో చాలామంది పడవల్లో గాఢ నిద్రలో ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత అర్ధరాత్రి దాటాక జాక్సన్ కంట్రీ పార్క్‌కు మంటలు అంటుకోగా ఆ వెంటనే డాక్‌యార్డ్ వైపునకు వేగంగా విస్తరించాయి. మంటలు చుట్టుముట్టడంతో తమను తాము రక్షించుకునేందుకు చాలామంది టెన్నెస్సీ నదిలో దూకారు. వారిని అధికారులు రక్షించారు.
America
Boat fire
Alabama
tennessee

More Telugu News