KTR: కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు!: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ కండువా కప్పుకోవాల్సింది పీసీసీ చీఫ్ ఉత్తమ్ కాదని, కేటీఆరేనంటూ కౌంటర్ ఇచ్చారు. యాదగిరిగుట్ట మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

నల్గొండ మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, మజ్లిస్‌ పార్టీలతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నందుకు గాను ఆ పార్టీల కండువాలు కప్పుకోవాలని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తిని కాల్చి చంపినా, ఉరిశిక్ష వేసినా తప్పులేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో అక్రమంగా గెలిచారని కోమటిరెడ్డి అన్నారు.
Go Back to Shorts
KTR
Uttam Kumar Reddy
KCR
Komatireddy Venkat Reddy

More Telugu News