Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం... 83 మంది మృతి?

  • ఘజ్నీ ప్రావిన్స్ లో కుప్పకూలిన విమానం
  • విమానం కూలిన ప్రాంతంలో తాలిబాన్ల ప్రాబల్యం
  • విమాన ప్రమాదంపై సందేహాలు
ఇటీవల ఇరాన్ లో విమానం కుప్పకూలిన ఘటన మరువక ముందే ఆఫ్ఘనిస్థాన్లో మరో విమాన ప్రమాదం జరిగింది. ఈ విమానంలో 83 మంది ప్రయాణికులుండడంతో వారంతా మరణించి వుంటారని భావిస్తున్నారు. అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఈ బోయింగ్ విమానం ఘజ్నీ ప్రావిన్స్ లోని సడో ఖేల్ ప్రాంతంలో కుప్పకూలినట్టు గుర్తించారు. ఈ ప్రాంతంలో తాలిబాన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో విమాన ప్రమాదంపై సందేహాలు తలెత్తుతున్నాయి. విమానం కూలిపోవడానికి కారణం సాంకేతిక లోపమా? లేక తాలిబాన్ల దాడి ఫలితమా? అనే అంశంపై దర్యాప్తు సాగుతోంది.
Afghanistan
Plane Crash
Ariana Afghan Airlines
Ghazni Province
Taliban

More Telugu News