love jihad: కేరళలో విచ్చలవిడిగా ‘లవ్ జిహాద్’ జరుగుతోంది: జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ
కేరళలో యువతులను బలవంతంగా మతమార్పిడులు చేస్తూ.. ‘లవ్ జిహాద్’ పేర పలుదేశాలకు తీసుకుపోయి వారిని సెక్స్ వస్తువులుగా ఉపయోగిస్తున్నారని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ ఆరోపించారు. దీన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలంటూ ఆమె కేరళ ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలను బలవంతంగా మత మార్పిడిలు చేస్తున్నారని చెప్పారు.
‘బలవంతపు మతమార్పిడులు, లవ్ జిహాద్, దేశాన్ని వీడుతున్న మహిళల అంశాలపై నేను పూర్తి విచారణ నిర్వహించాను. ఇతర మతాలకు చెందిన వ్యక్తులను పెళ్లి చేసుకోవడం సమస్య కాదు. బలవంతంగా మతమార్పిడులు చేయడమే ఒక సమస్య. ఇది కేరళలో విచ్చలవిడిగా జరుగుతోంది. బలవంతంగా మహిళలను లవ్ జిహాద్ పేర పలు దేశాల్లోకి తీసుకుపోతున్నారు. అక్కడ వారిని సెక్స్ వస్తువులుగా ఉపయోగిస్తున్నారు. కేరళ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఈ సమస్యను పరిష్కరించాలి. ఇది కొన్ని కమ్యూనిటీలకు చెందిన సమస్య కాదు..దేశానికి చెందిన సమస్య’ అని ఆమె అన్నారు.