Relangi Narasimha Rao: అసూయతో కూడిన ఆలోచనలో నుంచే ఆ కథ పుట్టింది: దర్శకుడు రేలంగి నరసింహారావు

  • 'అహ నా పెళ్లంట' హిట్ అయింది 
  • పిసినారితనం నేపథ్యంలో వచ్చింది 
  • జంధ్యాలగారితో పాటు నేను సక్సెస్ అయ్యానన్న రేలంగి నరసింహారావు   
రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో, 'ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం' సినిమా ముందువరుసలో కనిపిస్తుంది. రాజేంద్రప్రసాద్ కెరియర్లోనూ ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోయింది.

అలాంటి ఈ సినిమాను గురించి రేలంగి నరసింహారావు మాట్లాడుతూ .. "ఈ సినిమా కథ ఒక అసూయతో కూడిన ఆలోచనలో నుంచి పుట్టింది. జంధ్యాల గారితో సమానంగా నేను హాస్యభరిత సినిమాలు చేస్తూ వెళుతున్నాను. అలాంటి సమయంలో ఆయన 'అహ నా పెళ్లంట' తీశారు. పిసినారితనంపై ఆయన తీసిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ ఐడియా నాకు ఎందుకు రాలేదబ్బా అనిపించింది. పిసినారితనంపై సినిమా తీసి నేను కూడా హిట్ కొట్టాలనే పట్టుదల వచ్చింది. అందుకోసం నేను పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అలా అనుకున్నట్టుగానే కథ అల్లుకుని హిట్ కొట్టేశాను" అని చెప్పుకొచ్చారు.
Relangi Narasimha Rao
Jandhyala
Aha Na Pellanta

More Telugu News