YSRCP: రాజారెడ్డి లాంటి ఉత్తమోత్తమ వ్యక్తిని చంద్రబాబు విమర్శిస్తారా?: వైసీపీ నేత భూమన ఫైర్

  • జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తారా?
  • అందుకోసం జగన్ తాత రాజారెడ్డి గురించి ప్రస్తావిస్తారా?
  • ఏపీ అసెంబ్లీలో భూమన ఆగ్రహం
ఏపీ అసెంబ్లీ సమావేశంలో వైసీపీ సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ఆయన తాత రాజారెడ్డి గురించి ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు.

 ‘రాజారెడ్డి లాంటి ఉత్తమోత్తమమైన వ్యక్తి చాలా అరుదుగా రాజకీయాల్లో ఉంటారు. ఆయనతో ఇరవై మూడు సంవత్సరాలు ఏ ఒక్కరూ లేనంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా చెబుతున్నాను. కమ్యూనిస్టు నాయకుడు, నిజాయతీగా నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచిన ఎద్దుల ఈశ్వరరెడ్డి గారికి పులివెందుల నుంచి ఏజెంట్ గా 1977 వరకు రాజారెడ్డి ఉన్నారు. కమ్యూనిస్టు నాయకుడు, ప్రముఖ పాత్రికేయుడు, గొప్ప దార్శనికుడు గజ్జెల మల్లారెడ్డిగారికి అత్యంత ప్రాణసఖుడు రాజారెడ్డి గారు. ఇలాంటి గొప్ప వ్యక్తిని గురించి నీచంగా మాట్లాడటం చంద్రబాబునాయుడుకే తగింది’ అని విమర్శించారు.
YSRCP
Bhumana Karunakar Reddy
Chandrababu

More Telugu News