Chiranjeevi: 'ఇది నిజం'.. అంటూ పవన్ కల్యాణ్ ఫొటోను పోస్ట్ చేసిన బండ్ల గణేశ్

  • 'నేను భయంతో రాలేదు, బాధ్యతతో వచ్చాను' అన్న పవన్
  • ఆ వ్యాఖ్యను కూడా పోస్ట్ చేసిన బండ్ల గణేశ్
  • గతంలో పవన్ గురించి తాను చేసిన వ్యాఖ్యల వీడియో కూడా పోస్ట్ 
గతంలో సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నిర్మాత బండ్ల గణేశ్ ఎంతగా పొగడ్తల వర్షం కురిపించేవారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే, ఆయన గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ క్రమంలో జనసేనలో చేరకుండా కాంగ్రెస్‌లో ఎందుకు చేరాడని విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో మళ్లీ రాజకీయాల జోలికి వెళ్లనని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా, ఆయన చేసిన ట్వీట్లు చర్చకు దారి తీస్తున్నాయి.
 
'నేను భయంతో రాలేదు, బాధ్యతతో వచ్చాను' అంటూ పవన్ పదే పదే చెప్పే డైలాగ్‌తో పాటు పవన్ ఫొటోను పోస్ట్ చేస్తూ 'ఇది నిజం' అని బండ్ల గణేశ్ కామెంట్ చేశారు. పవన్‌పై మళ్లీ ఆయన ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో పవన్ గురించి తాను చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా బండ్ల గణేశ్ పోస్ట్ చేశారు. చిరంజీవిపై కూడా బండ్ల గణేశ్ సడన్‌గా ప్రశంసలు కురిపిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
Chiranjeevi
bandla ganesh
Pawan Kalyan

More Telugu News