BJP: బీజేపీకి మీరు వేసే ఓటు ద్వారా దేశాన్ని, ఢిల్లీని సురక్షితంగా తీర్చిదిద్దవచ్చు: అమిత్ షా

  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సభలో పాల్గొన్న అమిత్ షా 
  • సీఏఏను విమర్శిస్తున్న వారిపై మండిపాటు
  • బీజేపీకి ఓటు వేస్తే షహీన్‌బాగ్‌ వంటి ఘటనను నివారించవచ్చని వ్యాఖ్య
బీజేపీకి ఢిల్లీ ప్రజలు వేసే ఓటు ద్వారా దేశాన్ని, ఢిల్లీని సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) విమర్శిస్తున్న వారిపై విమర్శలు గుప్పించారు.

తమ పార్టీకి ఓటు వేస్తే షహీన్‌బాగ్‌ వంటి వేలాది ఘటనలను నివారించవచ్చని అమిత్ షా చెప్పారు. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో ఈవీఎంలో బటన్‌ నొక్కడం ద్వారా ఇటువంటి ఘటనలను ప్రతిఘటించవచ్చని వ్యాఖ్యానించారు. కాగా, గత నెల రోజులుగా సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో నిరసనకారులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తోన్న విషయం తెలిసిందే.  
BJP
New Delhi
Amit Shah

More Telugu News