KVP: ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు కేవీపీకి అనుమతి!

  • తెలంగాణలో మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక రసవత్తరం
  • నేరేడుచర్లలో కేవీపీకి ఓటు
  • ఓటు రద్దు చేసిన మున్సిపల్ కమిషనర్
  • కమిషనర్ ఆదేశాలను రద్దు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
తెలంగాణలో మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగుతోంది. కొన్నిచోట్ల ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లే నిర్ణయాత్మకం కానుండడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలోనూ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది.

తాజాగా, నేరేడుచర్లలో రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావుకు ఎక్స్ అఫీషియో ఓటు హక్కు కల్పించారు. దీనికి ముందు, కేవీపీ ఓటు హక్కును నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ రద్దు చేశారు. అయితే కమిషనర్ ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తూ, ఎక్స్ అఫీషియో కింద ఓటు వేసేందుకు కేవీపీకి అనుమతి ఇచ్చింది. ఈ సాయంత్రం నాలుగు గంటలకు చైర్మన్ ఎన్నిక జరగనుంది.
KVP
Ex Officio
Vote
Nereducharla
Municipal Elections
Chairman
Congress

More Telugu News