ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో సరికొత్త లోగో: సీఎం హేమంత్ సోరెన్
- అభ్యున్నతి దిశగా ‘సరికొత్త’ అడుగులు వేద్దామని పిలుపు
- సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి
- డిసెంబర్ ఎన్నికల్లో సోరెన్ విజయదుందుభి
ఝార్ఖండ్ సంస్కృతి, వారసత్వం ప్రతిబింబించేలా లోగో రూపకల్పన ఉంటుందని, ఇందుకు అన్నివర్గాలు తమవంతు చేయూత అందించాలని కోరారు. గత ఏడాది డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో ఝార్ఖండ్ ముక్తిమోర్చా, కాంగ్రెస్, ఆర్జేడీ సంయుక్త కూటమి విజయదుందభి మోగించగా, హేమంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.