Roja: నేను జగన్ ను గట్టిగా కోరుతున్నది ఇదే: రోజా

  • మండలిని రద్దు చేయాల్సిందే
  • అభివృద్ధిని అడ్డుకునే సభ ఎందుకు
  • బినామీల భూముల కోసమే చంద్రబాబు ఉద్యమం
  • వైసీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు
శాసన మండలిని రద్దు చేయాలని తాను సీఎం జగన్ ను గట్టిగా కోరుతున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె, తెలుగుదేశం పార్టీ వైఖరి కారణంగా శాసన మండలి విలువలు దెబ్బతిన్నాయని అన్నారు. మండలి గ్యాలరీల్లో కూర్చుని, చైర్మన్ ను బెదిరించి, తనకు అనుకూలంగా ఆయన వ్యవహరించేలా చంద్రబాబు చూశారని రోజా ఆరోపించారు. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాల్సిన పెద్దల సభ ఇలా అభివృద్ధిని అడ్డుకుంటుంటే ఆ సభ ఉండాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

ఓ రాయలసీమ నుంచి వచ్చిన ఎమ్మెల్యేగా చంద్రబాబు, ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేశారని, ఇప్పుడా ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు న్యాయ రాజధానిని పెడతామని చెబుతుంటే, అపహాస్యం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, ఆయన బినామీలు అమరావతిలో కొన్న భూములను కాపాడుకునేందుకే ఉద్యమాన్ని లేవదీశారని అన్నారు. మరోపక్క, గత ఆరు నెలల కాలంలోనే తాను ఇచ్చిన 80 శాతం హామీలను జగన్ నెరవేర్చారని రోజా వ్యాఖ్యానించారు.
Roja
YSRCP
Chandrababu
AP Legislative Council

More Telugu News