Virat Kohli: టీమిండియాకు 133 పరుగుల టార్గెట్ ఇచ్చిన న్యూజిలాండ్‌

  • ఆక్లాండ్‌లో రెండో టీ20
  • న్యూజిలాండ్ స్కోరు 132/5 
  • రెండు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా
  • శార్దూల్, బుమ్రా, శివమ్ దూబేలకు ఒక్కో వికెట్ 
ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానంలో జరుగుతోన్న భారత్, న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. మార్టిన్ గప్టిల్ 33, కొలిన్ మున్రో 26, కేన్ విలియమ్సన్‌ 14, గ్రాండ్ హోమ్ 3, రాస్ టేలర్ 18 పరుగులకు ఔటయ్యారు. టిమ్ సీఫెర్ట్ 33 (నాటౌట్), మిచెల్ శాంట్నర్ 0 (నాటౌట్) పరుగులు చేశారు.
 
టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, శివమ్ దూబేలకు ఒక్కో వికెట్ దక్కాయి. మొదటి టీ20లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.
Virat Kohli
Crime News
Team New Zealand

More Telugu News