Arvind Kejriwal: ఢిల్లీ ప్రజల తీర్పు అదే.. అమిత్ షా జోస్యం

  • వారణాసి, హర్యాణా ఫలితాలే ఢిల్లీలోనూ
  • కేజ్రీవాల్‌కు పరాభవం తప్పదు
  • వారిని శిక్షిస్తామంటే కేజ్రీవాల్ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్రమంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించి కేజ్రీవాల్ గద్దెనెక్కారని, ఈసారి అలా కుదరదని జోస్యం చెప్పారు. వారణాసి, హర్యాణా ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీకి ఎదురైన పరాభవమే ఈసారి ఢిల్లీలో ఎదురుకాబోతోందన్నారు. ఈ ఎన్నికల్లో తాము 88 సీట్లను గెలుచుకోబోతున్నట్టు చెప్పారు. కేజ్రీవాల్‌ కారణంగానే భారత్‌ను వెయ్యి ముక్కలు చేస్తామన్న వారు ఇప్పుడు రోడ్లపై హాయిగా తిరుగుతున్నారని అమిత్ షా ఆరోపించారు. వారిని జైలుకు పంపిస్తామంటే కేజ్రీవాల్ ప్రభుత్వం సహకరించలేదని అన్నారు. వారిని విచారిస్తామంటే అనుమతి ఇవ్వడం లేదని అమిత్ షా మండిపడ్డారు.

Arvind Kejriwal
New Delhi
Amit Shah

More Telugu News