Jaishe ohammad: జైషే మొహమ్మద్ కాశ్మీర్ చీఫ్ ఖారీ యాసిర్ హతం!

  • రిపబ్లిక్ వేడుకలకు ముందు ఘటన
  • ముగ్గురు టెర్రరిస్టులు హతం
  • ఐఈడీ బాంబుల తయారీలో సిద్ధహస్తుడైన ఖారీ
71వ గణతంత్ర వేడుకలను వైభవంగా నిర్వహించుకునేందుకు జాతి యావత్తూ సిద్ధమవుతున్న వేళ, జమ్మూ కశ్మీర్ లో సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. కాశ్మీర్ లో జైషే మొహమ్మద్ కు తనను తాను చీఫ్ గా ప్రకటించుకున్న ఖారీ యాసిర్ కూడా మరణించిన ముగ్గురు టెర్రరిస్టుల్లో ఉన్నాడు. గత సంవత్సరం పుల్వామాలో జరిగిన దాడికి సూత్రధారి ఇతనే. ఐఈడీ బాంబుల తయారీలో సిద్ధహస్తుడు. ఉగ్రవాదుల నియామకాలు, పాక్ లో శిక్షణ పొందిన వారిని సురక్షితంగా తరలించడం వంటి కార్యక్రమాల్లో ఖారీ యాసిర్ కు ప్రమేయం ఉందని లెఫ్టినెంట్ జనరల్ ధిల్లాన్ తెలియజేశారు.

Jaishe ohammad
Jammu And Kashmir
Khari Yasir
Encounter

More Telugu News