Telugudesam: జగన్ స్వార్థం కోసం ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడ్డారు: నారా లోకేశ్
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు మండిపడ్డారు. జగన్ తన స్వార్థం కోసం ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడ్డారని విమర్శించారు. ‘లులూ’ లాంటి ఎన్నో సంస్థలను రానీయకుండా చేశారని, అదే సంస్థకు మన పక్క రాష్ట్రమైన కర్ణాటక ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచిందని అన్నారు. మన యువతకు రావాల్సిన ఉద్యోగాలు కర్ణాటక యువతకు వెళ్లిపోయాయంటూ జగన్ పై విమర్శలు చేస్తూ లోకేశ్ ట్వీట్ చేశారు.