స్వీప్ చేస్తామన్న టీఆర్ఎస్ అక్కడక్కడా తుడిచిపెట్టుకుపోయింది: టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్
- మున్సిపల్ ఎన్నికల్లో మాకు మెరుగైన ఫలితాలు వస్తున్నాయి
- సిరిసిల్లలోనే రెబెల్ అభ్యర్థులు గెలిచారు!
- టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో ఇదే నిదర్శనం
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను, కాంగ్రెస్ ను, ఎంఐఎంనును బీజేపీ ఎదుర్కొందని చెప్పారు. ప్రజాతీర్పును చూస్తుంటే ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో బీజేపీ నాలుగు సీట్లు గెలిచిందని చెప్పారు. నిర్ణయాత్మకశక్తిగా ఎదుగుతున్నామని, కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ కు, మరికొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి, భైంసా వంటి ప్రాంతంలో ఎంఐఎంకు దీటుగా తాము ఫలితాలు సాధించామని అన్నారు.