Mahesh Babu: నా విషయంలో మహేశ్ బాబు ఎంతో కేర్ తీసుకున్నారు: ఫైటర్ సేతురామన్

  • ఆ డైలాగ్ బాగా పేలింది 
  • ఫైట్ సీన్ గొప్పగా వచ్చింది
  • మహేశ్ బాబు ధైర్యం చెప్పారన్న సేతురామన్
'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో 'రమణా లోడెత్తాల్రా ..' అనే డైలాగ్ తో సేతురామన్ పాప్యులర్ అయ్యారు. ఈ సినిమాలో ఆయన మహేశ్ బాబుతో చేసే ఫైట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సీన్ గురించి తాజా ఇంటర్వ్యూలో సేతురామన్ ప్రస్తావించారు. "ఈ సినిమాలోని ఫైట్ లో నేను నేలపై జారుతూ వెళ్లి మహేశ్ బాబును హిట్ చేయాలి. ఆ సీన్ లో జరిగిన చిన్న పొరపాటు కారణంగా నా మోకాలికి గాయమైంది. దాంతో నేను నిలబడలేని పరిస్థితి వచ్చేసింది.

అది ఫారెస్ట్ ఏరియా కావడంతో దగ్గరలో హాస్పిటల్స్ లేవు .. అందుబాటులో వున్న కేరళ వైద్యం చేయించారు. 'కంగారు పడకండి నేను చూసుకుంటాను' అని మహేశ్ బాబు గారు అనడంతో నాకు ధైర్యం వచ్చేసింది. ఆ తరువాత హైదరాబాద్ 'అపోలో'కి మేనేజర్ ను తోడుగా పంపించి, తన ఖర్చులతో ట్రీట్మెంట్ ఇప్పించారు. మహేశ్ బాబు మంచి నటుడు మాత్రమే కాదు .. అంతకు మించిన మంచి మనసున్న మనిషి" అని చెప్పుకొచ్చారు.
Mahesh Babu
Sethuraman
Sarileru Neekevveru

More Telugu News