Telugudesam: రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతిని నాశనం చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నాడు:: చంద్రబాబునాయుడు
- మూడు రాజధానుల ఆలోచన విఫలమైంది
- అమరావతిని నా వారసత్వంగా జగన్ చూస్తున్నాడు
- సీమాంధ్రుల ప్రయోజనాలను వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నాడు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోమారు విమర్శలు చేశారు. మూడు రాజధానుల ఆలోచన విఫలమైందని అన్నారు. అమరావతిని నా వారసత్వంగా జగన్ చూస్తున్నాడని, అందుకే, రాయలసీమ, ఆంధ్ర ప్రజల ప్రయోజనాలను వదిలివేయడానికి సిద్ధంగా ఉన్నాడని విమర్శించారు. రాజధాని అమరావతి ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు అని, రాజకీయ ప్రయోజనాల కోసం దానిని నాశనం చేసేందుకు జగన్ సిద్ధంగా ఉన్నాడని విమర్శిస్తూ ఓ పోస్ట్ లో చంద్రబాబు ధ్వజమెత్తారు.