Amit Shah: ఢిల్లీలో మూడొంతుల మంది పాకిస్థాన్ నుంచి వచ్చిన వాళ్లే: అమిత్ షా

  • ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా
  • కాంగ్రెస్, ఆప్ లపై విమర్శలు
  • ముస్లింలను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం
ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రాజధాని ఢిల్లీలో మూడొంతుల మంది పాకిస్థాన్ నుంచి వలస వచ్చినవాళ్లే ఉన్నారని వెల్లడించారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఆ శరణార్థులకు పౌరసత్వం అందించేందుకే తాము సీఏఏ తీసుకువస్తే, కాంగ్రెస్, ఆప్ దాన్ని వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు సీఏఏకి వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. షహీన్ బాగ్ లో ఆందోళనకు మద్దతు ఇస్తామని ప్రకటిస్తున్నారని, నెల రోజుల నుంచి కాంగ్రెస్ నేతలు షహీన్ బాగ్ ప్రాంతంలో పర్యటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా అల్లర్లను ప్రోత్సహించే చర్యలకు దిగారని విమర్శించారు.
Amit Shah
Pakistan
New Delhi
BJP
Congress
AAP

More Telugu News