Nara Lokesh: అప్పట్లో మేము అలా చేసేవాళ్లం.. ఇప్పుడు వైసీపీ నేతలు ఇలా చేస్తున్నారు: ఫొటోలు పోస్ట్ చేసిన నారా లోకేశ్

  • వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్‌కు అప్పట్లో హాజరయ్యే వాళ్లం
  • వైకాపా హయాంలో స్వార్థ ప్రయోజనాలు నెగ్గించుకునేందుకు యత్నిస్తోంది
  • పోడియం ఎక్కి కష్టపడుతున్నారు 
  • పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణకు మధ్య ఉన్న తేడా ఇదే
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పెట్టుబడులు తీసుకురావడానికి చాలా కృషి చేసిందని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి ప్రయత్నాలు చేయట్లేదని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.

'దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్‌కు హాజరై పెట్టుబడులు ఆకర్షించేందుకు టీడీపీ హయాంలో ఎంతో శ్రమించేవాళ్లం. ఇప్పుడు వైకాపా హయాంలో స్వార్థ ప్రయోజనాలు నెగ్గించుకునేందుకు ఇలా పోడియం ఎక్కి కష్టపడుతున్నారు. పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణకు మధ్య ఉన్న తేడా ఇదే' అంటూ ఆయన కొన్ని ఫొటోలు పోస్టు చేశారు.
Nara Lokesh
World Economic Forum
Davos
Telugudesam
YSRCP

More Telugu News