pridvi: ఎస్వీబీసీ నిర్వహణలో మార్పులు.. ఎండీగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి!

  • ఇటీవల చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృథ్వీరాజ్ 
  • ఎస్వీబీసీకి మరో ఇద్దరు డైరెక్టర్లను నియమించాలని యోచన
  • ఖాళీగానే ఎస్వీబీసీ చైర్మన్ పదవి 
ఓ ఉద్యోగినితో సినీ నటుడు పృథ్వీరాజ్‌ జరిపిన సరస సంభాషణ ఆడియో బయటకు రావడంతో ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.

ఎస్వీబీసీలో కొత్తగా ఎండీ పోస్టును సృష్టించి, ఆ పదవిలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమించింది. ఈ మేరకు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్వీబీసీకి మరో ఇద్దరు డైరెక్టర్లను నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎస్వీబీసీ చైర్మన్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. దాన్ని అలాగే వదిలేయాలని వైసీపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
pridvi
Tirumala
svbc channel

More Telugu News