India: టీమిండియా టార్గెట్ 204 రన్స్... ఆదిలోనే రోహిత్ శర్మ అవుట్

  • మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు
  • అర్ధసెంచరీలు సాధించిన మున్రో, విలియమ్సన్, టేలర్
న్యూజిలాండ్ తో తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఓపెనర్ కొలిన్ మున్రో (59), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51), రాస్ టేలర్ (54 నాటౌట్) అర్ధసెంచరీలు సాధించారు. మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 30 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా, ఠాకూర్, చాహల్, దూబే, జడేజా తలో వికెట్ తీశారు. షమీకి ఒక్క వికెట్ కూడా పడలేదు.

ఇక 204 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 7 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 31 పరుగులు. క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ కోహ్లీ ఆడుతున్నారు.
India
Team New Zealand
Cricket
Auckland
T20
Rohit Sharma

More Telugu News