Andhra Pradesh: నీకున్న తెలివితేటలు ఈ దేశంలో ఎవరికీ లేవు జగనన్నా!: కేశినేని నాని

  • శాసనమండలి అవసరమా అంటూ జగన్ వ్యాఖ్యలు
  • జగన్ పై కేశినేని నాని సెటైర్
  • నీలాంటివాళ్లు రాజ్యసభను కూడా రద్దు చేయమంటారని వ్యంగ్యం
సీఎం జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శాసనమండలి అవసరమా..? అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై నాని స్పందించారు. 'నీకున్న తెలివితేటలు ఈ దేశంలో ఎవరికీ లేవు జగనన్నా' అంటూ సెటైర్ వేశారు. ఒకవేళ ఎవరికైనా నీలాంటి తెలివే ఉంటే రాజ్యసభను కూడా రద్దు చేయమనేవారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీని ఎక్కడైనా ఏర్పాటు చేయొచ్చని, రాష్ట్రంలో ఎక్కడ్నించైనా సీఎం పరిపాలించవచ్చని వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం తెలిసిందే.
Andhra Pradesh
Amaravati
Telugudesam
Kesineni Nani
Jagan
YSRCP

More Telugu News