Chandrababu: తీర్మానం లేకుండా మండలి రద్దుపై చర్చ రాజ్యాంగ విరుద్ధం : చంద్రబాబు

  • రాజధాని అంశం ఇప్పుడు కోర్టు, సెలెక్ట్‌ కమిటీ పరిధిలో ఉంది
  • దీనిపై అసెంబ్లీలో ఎలా చర్చిస్తారు?
  • మండలిని రద్దు చేస్తామంటే బెదిరిపోయేవారెవరూ లేరిక్కడ
మండలి రద్దుపై ఎటువంటి తీర్మానం చేయకుండా అసెంబ్లీలో దానిపై ఎలా చర్చిస్తారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈరోజు ఉదయం చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలి రద్దు అంశం జగన్‌ ప్రభుత్వం మరో అనాలోచిత నిర్ణయమన్నారు. అయినా మండలిని రద్దు చేస్తామనగానే బెదిరిపోయేవారెవరూ ఇక్కడ లేరన్నారు. ప్రస్తుతం రాజధాని అంశం సెలెక్ట్‌ కమిటీ, కోర్టు పరిధిలో ఉందని, ఈ పరిస్థితుల్లో దానిపై అసెంబ్లీలో ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. కౌన్సిల్‌ చైర్మన్‌ ప్రసంగానికి వక్రభాష్యాలు అంటగడుతున్నారని, చట్టాలను తుంగలో తొక్కుతారా? అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
Chandrababu
Telugudesam
Amaravati
AP Legislative Council
AP Assembly Session
Jagan
YSRCP

More Telugu News