Rajinikanth: ఎప్పుడో జరిగిన వాటిని గుర్తు చేసి వివాదాల్లో చిక్కుకోవడం ఎందుకు?: రజనీకాంత్ పై మరో మంత్రి ఫైర్

  • తమిళనాట కొనసాగుతున్న రజనీ వ్యాఖ్యల దుమారం
  • మీ కుమార్తె మళ్లీ పెళ్లి పెరియార్ పుణ్యమే
  • అలా మాట్లాడి వుండకపోయి వుంటే బాగుండేదన్న మంత్రి 
సూపర్ స్టార్ రజనీకాంత్‌పై తమిళనాట ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. ద్రవిడ ఉద్యమ నేత పెరియార్‌ ఈవీ రామస్వామిపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. పెరియార్‌ను కించపరిస్తే సహించేది లేదని మంత్రి జయకుమార్ ఇప్పటికే రజనీని హెచ్చరించారు. పెరియార్ కీర్తిని అప్రతిష్ఠపాలు చేసేలా ప్రయత్నిస్తే అన్నాడీఎంకే చూస్తూ ఊరుకోబోదన్నారు.

ఇప్పుడు మరోమంత్రి సెల్లూర్ కె రాజు స్పందించారు. ఎప్పుడో జరిగిన ఘటన గురించి రజనీకాంత్ ఇప్పుడు మాట్లాడి ఉండకపోయి ఉంటే బాగుండేదని అన్నారు. పెరియార్ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే రజనీ కుమార్తె సౌందర్య మరో పెళ్లి చేసుకున్నారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. ఎప్పుడో జరిగిన వాటిని గుర్తు చేసి వివాదాల్లో చిక్కుకోవడం సరికాదన్నారు.
Rajinikanth
Periyar E. V. Ramasamy
Tamil Nadu

More Telugu News