Jagan: సీఎం జగన్ దెబ్బకు చంద్రబాబు మండలి గ్యాలరీ ఎక్కాడు: కొడాలి నాని వ్యంగ్యం

షార్ట్స్‌లో చూడండి
నిన్న శాసనమండలిలో గ్యాలరీలో కూర్చున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మంత్రి కొడాలి నాని సెటైర్లు విసిరారు. ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను అని, అన్నేళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబునాయుడు సీఎం జగన్ దెబ్బకు  గ్యాలరీ ఎక్కారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇక ఈసారి, అసెంబ్లీలో గ్యాలరీకి చంద్రబాబు వెళ్లేలా చేయాలంటూ జగన్ ని కోరుతూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ సభ్యులు బల్లలు చరుస్తూ నవ్వులు చిందించారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ షరీఫ్ పైనా కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. ముప్పై ఏడు ఏళ్లుగా షరీఫ్ తనకు తెలుసని, టీడీపీకి ఆయన చాలా సిన్సియర్ కార్యకర్త అంటూనే నిన్న ఆయన తీసుకున్న నిర్ణయంపై విమర్శలు చేశారు. ఈ విషయంలో షరీఫ్ ను అనేందుకు ఏమీ లేదని, ఎందుకంటే, ఆ నిర్ణయం వెనుక చంద్రబాబు ఉన్నారంటూ ధ్వజమెత్తారు.
Go Back to Shorts
Jagan
cm
minister
Kodali Nani
Chandrababu

More Telugu News