Telangana: తెలంగాణలో ఈ నెల 27న మేయర్లు, చైర్మన్ల ఎంపిక

  • నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
  • ఈ నెల 27న కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం
  • ఆ సమావేశంలోనే మేయర్లు, చైర్మన్ల ఎంపిక ప్రక్రియ
తెలంగాణ రాష్ట్రంలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాల్టీలకు ఎన్నికల పోలింగ్ నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేయర్లు, చైర్ పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 27న కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

కాగా, ఈ నెల 25న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో గెలిచిన సభ్యులు జనవరి 27వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం, కొత్త పాలక మండలి తొలి సమావేశం తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్లు, చైర్మన్ల ఎన్నిక జరగనుంది.
Telangana
Muncipal polls
Mayor
chaiman

More Telugu News