Sensex: స్టాక్ మార్కెట్ దూకుడు.. మూడు రోజుల నష్టాలకు బ్రేక్!

షార్ట్స్‌లో చూడండి
వరుసగా మూడు సెషన్లలో నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 271 పాయింట్లు లాభపడి 41,386కి పెరిగింది. నిఫ్టీ 73 పాయింట్లు పుంజుకుని 12,180 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (2.98%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.31%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.26%), టైటాన్ కంపెనీ (2.25%), ఇన్ఫోసిస్ (1.90%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.24%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.03%), టీసీఎస్ (-0.80%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.40%), బజాజ్ ఆటో (-0.40%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News