KCR: రైతుల సమస్యలను సీఎం కేసీఆర్ ఒక్కోటి పరిష్కరిస్తున్నారు: మంత్రి హరీశ్ రావు

  • నాబార్డు సేవలు ప్రశంసనీయం
  • తెలంగాణ ప్రభుత్వం ‘ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం’ 
  • నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సులో హరీశ్
సీఎం కేసీఆర్ ఒకప్పుడు రైతు కనుకనే రైతుల సమస్యలను ఒక్కోటి ఆయన పరిష్కరిస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ రోజు హైదరాబాద్, బంజారాహిల్స్ లోని నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ, గోదాముల నిర్మాణంతో పాటు, సూక్ష్మ సేద్యానికి అండగా నిలిచిన నాబార్డు సేవలు ప్రశంసనీయమని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ‘ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం’ అని అన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ సందర్భంగా నాబార్డు స్టేట్ ఫోకస్ పేపర్ 2020-21ని హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ సదస్సులో నాబార్డు సీజీఎం విజయ్ కుమార్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ మయా, ఆంధ్రాబ్యాంక్ ఈడీ కుల్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. 
KCR
cm
Minister
Harish Rao
NABARD

More Telugu News