Pawan Kalyan: రాజధాని వికేంద్రీకరణపై వైసీపీ తప్పుడు ప్రచారం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

  • ఆ నిర్ణయంతో బీజేపీకి సంబంధం లేదు
  • ప్రధాని, హోంమంత్రులకు ఎవరూ ఏమీ చెప్పి చేయడం లేదు
  • రైతులకు అండగా పోరాటానికి త్వరలో కార్యాచరణ
కేంద్రం అనుమతితోనే రాజధాని అమరావతిని మారుస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇందులో వాస్తవం లేదని బీజేపీ పెద్దలు తనకు చెప్పారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి పాత్రలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలని సూచించారు. అమరావతి రైతుల పోరాటానికి అండగా ఉంటామని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.
Pawan Kalyan
Amaravati
New Delhi

More Telugu News