Tollywood: సినీ హాస్యనటుడు సునీల్‌కు అస్వస్థత

  • గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చేరిన సునీల్
  • పలు వైద్య పరీక్షల నిర్వహణ
  • చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది
ప్రముఖ సినీ హాస్య నటుడు సునీల్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చేరారు. ఆయనకు వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ఆయన అనారోగ్యానికి గురైన విషయంపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

విడుదలకు సిద్ధమైన రవితేజ సినిమా 'డిస్కో రాజా'లో సునీల్ నటించారు. కమెడియన్‌గానే కాకుండా హీరోగానూ ఆయన పలు సినిమాల్లో నటించారు. ఓ సినిమాలో ఆయన విలన్ పాత్రలోనూ నటిస్తున్నారు.
Tollywood
Sunil
Hyderabad

More Telugu News