Andhra Pradesh: ఏపీ మంత్రులతో జగన్ కీలక భేటీ

  • భేటీలో పాల్గొన్న బుగ్గన‌, బొత్స, కొడాలి నాని, వెల్లంపల్లి‌, కురసాల
  • ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లుపై చర్చ 
  • తమ తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్న జగన్
ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తమ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో అసెంబ్లీ ప్రాంగణంలోని తన ఛాంబర్‌లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. వైసీపీ ముఖ్యనేతలు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, కురసాల కన్నబాబు, ప్రసాద్‌ రావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డితో పాటు పలువురు నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.

ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లుపై వారు కీలక చర్చలు జరుపుతున్నారు. వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపిన విషయం తెలిసిందే. దీంతో తమ తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న విషయంపై జగన్ చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Andhra Pradesh
Amaravati
YSRCP

More Telugu News