Allu Arjun: సినీనటుడు అల్లు అర్జున్‌ మేనమామ మృతి!

  • గుండెపోటుతో ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ మృతి
  • విజయవాడ బయల్దేరిన అల్లు కుటుంబం
  • సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్‌ విజయవాడలోని తన నివాసంలో నిన్న గుండెపోటుతో మృతి చెందారు. అల్లు అర్జున్‌ తల్లి నిర్మలాదేవికి రాజేంద్ర ప్రసాద్‌ అన్నయ్య. మేనమామతో బన్నీ చాలా సన్నిహితంగా ఉండేవారు.

సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న బన్నీ సినిమాకు రాజేంద్రప్రసాద్‌ సహ నిర్మాతగా సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలని భావించారు. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Allu Arjun
Tollywood
Vijayawada

More Telugu News