Jagan: జగన్ రెడ్డీ... నీవు పెట్టే కేసులన్నీ నాకు సన్మానమే: కేశినేని నాని

  • ముగ్గురు ఎంపీల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు
  • ఈ ఘనత నీదే జగన్ రెడ్డీ
  • నీవు ఎన్ని కేసులు పెడితే మాకు అన్ని సన్మానాలు చేసినట్టు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రాజధానిని మార్చకూడదంటూ ఆందోళనలు చేస్తున్న రైతులు, మహిళలకు సంఘీభావం ప్రకటించిన పలువురు టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ గల్లా జయదేవ్ జైలుకు వెళ్లి, బెయిల్ పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా కేశినేని నాని స్పందించారు.

'అమరావతి పరిరక్షణ కోసం, రాష్ట్రం కోసం, రైతుల కోసం పోరాడుతున్న ముగ్గురు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రతో పాటు తన మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఘనత నీదే జగన్ రెడ్డి. నువ్వు ఎన్ని కేసులు పెడితే మాకు అన్ని సన్మానాలు చేసినట్లే అవుతుంది గుర్తుంచుకో' అని వ్యాఖ్యానించారు.  
Jagan
Kesineni Nani
Amaravati
Telugudesam
YSRCP

More Telugu News