Donald Trump: గర్భిణుల ఆశలపై నీళ్లు చల్లేందుకు ట్రంప్ ప్రభుత్వం రెడీ!

  • అమెరికాలో ప్రసవిస్తే అక్కడి పౌరసత్వం
  • పర్యాటక వీసాలపై ఇక అమెరికా వెళ్లడం కష్టమే
  • నేడు ముసాయిదా వెల్లడించనున్న ట్రంప్ ప్రభుత్వం
గర్భిణుల ఆశలపై నీళ్లు చల్లేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. వారి కోసం ప్రత్యేకంగా కొత్త వీసా నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన ముసాయిదాను నేడు వెల్లడించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధనలు కనుక అమల్లోకి వస్తే పర్యాటక వీసాపై గర్భిణులు అమెరికా వెళ్లడం మరింత కష్టమవుతుంది. ఫలితంగా అమెరికాలో ప్రసవిస్తే అక్కడి పౌరసత్వం లభిస్తుందని భావించే వారికి ఇది చేదు గుళికగా మారనుంది. అయితే, ఈ నిబంధనను అమలు చేయడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ఆంక్షల పేరుతో అమెరికా వచ్చే వారికి ఝలక్ ఇస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. ఇప్పుడు గర్భిణులపై దృష్టిసారించడం చర్చనీయాంశమైంది.
Donald Trump
America
tourist visa

More Telugu News