Balakrishna: మండలికి బాలకృష్ణ.. సెల్ఫీల కోసం వైసీపీ ఎమ్మెల్యేల పోటీ!

  • మండలి సమావేశాలను తిలకించేందుకు వెళ్లిన బాబు, బాలయ్య
  • రోజా సహా సెల్ఫీల కోసం పోటీ
  • సందడిగా మారిన గ్యాలరీ
అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై శాసన మండలి సమావేశాలు ఉత్కంఠగా సాగుతున్న వేళ.. వాటిని తిలకించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఇతర నేతలు వెళ్లారు. బాలకృష్ణను అక్కడ చూడగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనతో సెల్ఫీల కోసం పోటీపడ్డారు. రోజా, కాసు మహేశ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అబ్బయ్య చౌదరి, వసంత కృష్ణప్రసాద్ తదితరులు బాలకృష్ణతో సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత కాసేపు సరదాగా ముచ్చటించారు. బాలయ్యతో సెల్ఫీలకు పోటీ పడడంతో మండలిలో ఒక్కసారిగా సందడి నెలకొంది.
Balakrishna
Chandrababu
Selfie
Roja

More Telugu News