Telugudesam: భారతదేశ చరిత్రలో ఇది అద్భుతమైన ఘట్టం: ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్

  • రూల్ ప్రకారం వెళితే ప్రభుత్వాలు గడగడలాడాల్సిందే
  • ఆ విషయం ఇప్పుడు పూర్తిగా రుజువైంది
  • అమరావతి కోసం చంద్రబాబు చాలా శ్రమించారు
ఏపీ శాసనమండలి నిర్ణయంపై ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవి శంకర్ హర్షం వ్యక్తం చేశారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. భారతదేశ చరిత్రలో ఇది అరుదైన ఘట్టమని అన్నారు. ముక్కు సూటిగా నిలబడి రూల్ ప్రకారం వెళ్లే వాళ్లు ఉన్నంత వరకూ ప్రభుత్వాలు, అసెంబ్లీలే కాదు పార్లమెంట్ లు సైతం గడగడలాడిపోతాయని, ఆ విషయం ఇప్పుడు పూర్తిగా రుజువైందని అన్నారు. రాజధాని అమరావతి కోసం చంద్రబాబునాయుడు చాలా తీవ్రంగా శ్రమించారని, ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్లేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Telugudesam
Amaravati
Advocate
Jandhyala

More Telugu News