Andhra Pradesh: ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా 

  • సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు
  • మండలి చైర్మన్ నిర్ణయంతో ప్రతిపక్ష సభ్యుల హర్షం
  • నిరసన వ్యక్తం చేసిన అధికారపక్ష సభ్యులు 
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని ఏపీ శాసనమండలి సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయంపై టీడీపీ సభ్యులు హర్షం వ్యక్తం చేయగా, అధికార పక్ష సభ్యులు మాత్రం నిరసన తెలిపారు. దీంతో, శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో నిరవధిక వాయిదా వేస్తున్నట్టు షరీఫ్ ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంపై టీడీపీ సహా ప్రతిపక్షనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh
council

More Telugu News