Girl: నాలుగో తరగతి చదువుతోన్న బాలికపై అత్యాచారం

  • పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో దారుణం
  • పాఠశాలనుంచి బాలికను ఎత్తుకెళ్లిన దుండగుడు
  • నిర్మానుష్య ప్రాంతంలో బాలిక నోరుమూసి అత్యాచారం
లైంగిక దాడుల నిరోధానికి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినప్పటికీ, మహిళలు, పిల్లలపై ఈ దాడులు ఆగడంలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ బాలికపై అత్యచార ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కామవరపుకోటలో ఈ దారుణం జరిగింది. స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోన్న బాలికపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.  పొట్లూరు అంజయ్య అనే వ్యక్తి పాఠశాలనుంచి బాలికను ఎత్తుకెళ్లాడని చెప్పారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలిక నోరుమూసి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారన్నారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 
Girl
Rape
Andhra Pradesh
West Godavari District

More Telugu News