Nithyananda: నిత్యానంద ఆచూకీ కోసం గుజరాత్ పోలీసుల ప్రయత్నాలు... రంగంలోకి ఇంటర్ పోల్

  • అహ్మదాబాద్ ఆశ్రమంలో అమ్మాయిలపై అత్యాచారాలు
  • గుజరాత్ పోలీసుల దర్యాప్తు
  • విదేశాలకు పారిపోయిన నిత్యానంద
  • బ్లూకార్నర్ నోటీసులు జారీచేసిన ఇంటర్ పోల్
అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానందపై అంతర్జాతీయ స్థాయిలో వేట మొదలైంది. అహ్మదాబాద్ ఆశ్రమంలో అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు రాగా, గుజరాత్ పోలీసులు నిత్యానందపై దర్యాప్తు షురూ చేశారు. అయితే నిత్యానంద కరీబియన్ దీవుల్లో తలదాచుకున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో గుజరాత్ పోలీసులు ఇంటర్ పోల్ సాయం కోరారు. గుజరాత్ పోలీసుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఇంటర్ పోల్ నిత్యానందపై బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసింది.
Nithyananda
Spiritual
Ahmedabad
Gujarath

More Telugu News