YSRCP: మార్షల్స్‌ను రంగంలోకి దింపండి: అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ ఆగ్రహం

  • టీడీపీ సభ్యులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు
  • టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తోంది
  • సభలో మాట్లాడటం చేతకాకపోతే సభ బయటే ఉండాలి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభలో టీడీపీ సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఏపీ సీఎం జగన్ విరుచుకుపడ్డారు. టీడీపీ సభ్యుల తీరుతో సభ నడిచే అవకాశం లేకుండాపోతోందని అన్నారు. పోడియం రింగ్ దాటి వస్తే మార్షల్స్‌ను రంగంలోకి దింపండని అన్నారు.

టీడీపీ సభ్యులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని జగన్ చెప్పారు. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తోందని తెలిపారు. సభలో మాట్లాడటం చేతకాకపోతే సభ బయటే ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఈ గందరగోళం మధ్యే ఏపీలో రైతు భరోసా కేంద్రాలపై చర్చను ప్రారంభించారు.
YSRCP
Andhra Pradesh

More Telugu News