Students: హైదరాబాద్ లో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు... కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు!

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ పరిధిలోని ఏఎస్ రావు నగర్ కు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థులు ఒకేసారి అదృశ్యం కావడంపై పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించారు. ఓ లెటర్ రాసిపెట్టిన ముగ్గురూ ఒకేసారి మాయం కావడంపై ప్రత్యేక బృందాలతో గాలిస్తూ, వారు ఎక్కడికి వెళ్లారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సెయింట్ థెరిసా స్కూల్ లో వీరు ముగ్గురూ పదో తరగతి చదువుతున్నట్టు తెలుస్తోంది. తమ బిడ్డలు కనిపించడం లేదని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు, అన్ని సీసీటీవీ ఫుటేజిలను పరిశీలిస్తున్నారు. నిన్న ఉదయం స్కూల్ కు వెళ్లిన వారి ఆచూకీ, ఇంతవరకూ తెలియలేదని సమాచారం.
Go Back to Shorts
Students
Missing
Hyderabad
Police
CCTV

More Telugu News