Pawan Kalyan: ప్రధాని మోదీతో నేడు పవన్ కల్యాణ్ భేటీ?

షార్ట్స్‌లో చూడండి
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు భేటీ అయ్యే అవకాశం వుంది. పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి మోదీ సహా పలువురు బీజేపీ ముఖ్య నాయకులను పవన్ కలుసుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించనున్నట్టు సమాచారం. పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు నడ్డాతోనూ పవన్ సమావేశం కానున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి సమన్వయ కమిటీ సమావేశంలో జనసేనాని పాల్గొంటారని తెలిసింది. మరోవైపు, ఏపీకి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పవన్ కల్యాణ్‌ను సంప్రదించాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Narendra Modi

More Telugu News