Andhra Pradesh: పవన్ కల్యాణ్ పై పోలీసు చర్యలను ఖండిస్తున్నా: కన్నా

  • రాజధాని గ్రామాల్లో పర్యటించాలనుకున్న పవన్
  • అభ్యంతరం చెప్పిన పోలీసులు
  • ట్విట్టర్ లో స్పందించిన కన్నా
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గతరాత్రి రాజధాని గ్రామాల రైతులను పరామర్శించేందుకు ప్రయత్నించగా, పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఓ దశలో పవన్ కు, పోలీసు అధికారులకు మధ్య వాగ్యుద్ధం నడిచింది.

దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. తమ భాగస్వామ్య పక్షనేతకు సంఘీభావం ప్రకటించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ చంద్రబాబు బాటలోనే జగన్ కూడా నడుస్తున్నాడని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నిరంకుశ నియంతృత్వ విధానాలతో పాలించిన ఏ నాయకుడు విజయవంతం కాలేదని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Amaravati
AP Capital
Pawan Kalyan
Janasena
Kanna Lakshminarayana
BJP
Police

More Telugu News