Harish Rao: హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు.. జగ్గారెడ్డిపై హెచ్ ఆర్సీలో ఫిర్యాదు

  • మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు
  • జగ్గారెడ్డిపై చర్యలకు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డిమాండ్
  • జగ్గారెడ్డి భాష సవ్యంగా లేకపోతే ఊరుకోమని హెచ్చరిక
మంత్రి హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు మానవ హక్కుల సంఘం (హెచ్ ఆర్సీ)లో ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు మాట్లాడుతూ, ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు, హరీశ్ రావుకు తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగ్గారెడ్డి భాష సవ్యంగా లేనిపక్షంలో ఆయన నివాసం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.
Harish Rao
Mla
Jaggareddy
HRC
Telangana

More Telugu News