Pawan Kalyan: కూల్చేయడానికి, పీకేయడానికి ఇది సినిమా సెట్టింగ్ కాదు: పవన్ పై ధ్వజమెత్తిన జోగి రమేశ్

  • వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని పవన్ వ్యాఖ్యలు
  • తీవ్రంగా స్పందించిన జోగి రమేశ్
  • మహామహులే మట్టికరిచారంటూ దీటైన జవాబు
వైసీపీ సర్కారు పతనం ప్రారంభమైందని, ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోనని జనసేనాని పవన్ కల్యాణ్ భీషణ ప్రతిజ్ఞ చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఘాటుగా స్పందించారు. పీకేయడానికి, కూల్చేయడానికి ఇదేమీ సినిమా సెట్టింగ్ కాదని అన్నారు. వైసీపీని నామరూపాల్లేకుండా చేస్తామని, జగన్ ను జైల్లో వేస్తామని చెప్పిన కాంగ్రెస్, టీడీపీ గల్లంతయ్యాయని, ఢిల్లీ కోటనే ఢీకొట్టిన ధీరుడు వైఎస్ జగన్ అని వ్యాఖ్యానించారు.

పవన్ ఈ విషయాలు గ్రహిస్తే మంచిదని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్ నిర్ణయానికి మద్దతిస్తున్నారని, జనసేన ఎమ్మెల్యే రాపాక సైతం సీఎం నిర్ణయాన్ని స్వాగతించారని జోగి రమేశ్ వివరించారు. ఒక సదాశయంతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని కొనియాడారు.
Pawan Kalyan
Janasena
Andhra Pradesh
Amaravati
AP Capital
YSRCP
Jagan
Jogi Ramesh

More Telugu News