Janasena: జనసేన ఎమ్మెల్యే కూడా మాకు మద్దతు తెలిపారు: జగన్

  • ఎస్సీలను విడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు చేశారు
  • ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాల్లో ఒకచోట టీడీపీ, ఒకచోట జనసేన గెలిచింది
  • మిగతా అన్ని స్థానాల్లోనూ మా పార్టీయే విజయం సాధించింది
తమ ప్రభుత్వ పాలన పట్ల జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ రోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.... తమ ప్రభుత్వం చేపడుతోన్న పలు కార్యక్రమాలకు రాపాక మద్దతు తెలిపారని అన్నారు.

ఎస్సీలను విడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాల్లో ఒకచోట టీడీపీ, ఒకచోట జనసేన మాత్రమే గెలిచాయని చెప్పారు. మిగతా అన్ని స్థానాల్లోనూ తమ పార్టీయే విజయం సాధించిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఆరు మంత్రి పదవులు ఇచ్చామని చెప్పారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో ఇద్దరు ఎస్సీ, ఎస్టీ డిప్యూటీ సీఎంలు ఉన్నారని తెలిపారు.
Janasena
Jagan
YSRCP

More Telugu News